Header Banner

ఆధార్‌ కార్డులో 12 నంబర్లే ఎందుకు ఉంటాయో తెలుసా.? అసలు కారణం ఇదే!

  Tue Mar 11, 2025 10:32        Business

ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏ చిన్న పని జరగాలన్నా ఆధార్ మాండేటరీ. స్కూలు అడ్మిషన్ నుంచి జాబ్ వచ్చిన తర్వాత బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ వరకు.. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి సిమ్ కార్డు వరకు.. ఇలా ఏది కావాలన్నా ఆధార్ తప్పనిసరి అయిపోయింది. వీటితో పాటు ప్రభుత్వ పథకాల లబ్ది పొందేందుకు కూడా ఆధార్‌ అవసరం. ప్రస్తుతం దేశంలో 90 శాతం కంటే ఎక్కువ మంది జనాభాకు ఆధార్ కార్డు ఉంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డ్‌ని జారీ చేస్తుంది. బయోమెట్రిక్, జనాభా వివరాలను నమోదు చేసుకుని, 12-అంకెల ప్రత్యేక ఆధార్‌ నంబర్‌ని కేటాయిస్తుంది. ఇంతకీ ఆధార్‌ 12 అంకెలే ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా ? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది. దేశ జనాభా దాదాపు 140 కోట్లకు పైగా ఉంది. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి. ఇంత మందికి గుర్తింపు సంఖ్య కేటాయించేందుకు 12-అంకెల సంఖ్యను ఎంచుకున్నారు. ఇంత పొడవుగా ఉండటవ వల్లే ఎక్కువ మందికి విభిన్నమైన నంబర్‌లు ఇచ్చే అవకాశం కలిగింది. 12-అంకెల ఆధార్ నంబర్‌తో ప్రభుత్వం వివిధ పథకాల నుంచి ప్రయోజనం పొందుతున్న వ్యక్తులను సులభంగా గుర్తించగలదు.

 

ఇది కూడా చదవండి: టాటా క్యాపిటల్ ఐపీఓ కోసం ఎదురు చూస్తున్నారా? ఇది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

 

ఇది ఫేక్ ఐడెంటిటీస్ కూడా నిరోధిస్తుంది. ప్రజలు ఆన్‌లైన్ సేవలను పొందడం సులభతరం చేస్తుంది. అంతేకాకుండా.. సైబర్ నేరగాళ్లు ఆధార్ డేటాను అంత ఈజీగా చోరీ చేయలేదు. మాస్క్‌డ్‌ ఆధార్ (Masked Aadhaar)..: ఇంత కీలకమైన ఆధార్‌ కార్డ్‌ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేకపోతే ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఊహించని నేరాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆధార్ కార్డ్ లాగానే మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్ కూడా చాలా ముఖ్యమైంది. ఐడెంటిటీ ప్రూఫ్‌ కోసం ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు. మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్‌లో ఆధార్ నంబర్‌లోని మొదటి 8 నంబర్లు హైడ్‌ అయి ఉంటాయి. కేవలం చివరి 4 నంబర్లు మాత్రమే కనిపిస్తాయి. వివరాలను ఆయా సంస్థలు, వ్యక్తులు పొందలేరు. ఆధార్ కార్డ్‌తో జరిగే మోసాల నుంచి రక్షణ పొందవచ్చు. మాస్క్‌డ్‌ ఆధార్ డౌన్‌లోడ్ ప్రాసెస్ (Masked Aadhaar Download Process): యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా మాస్క్‌డ్‌ ఆధార్ కార్డ్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఆధార్ అధికారిక పోర్టల్‌ www.uidai ఓపెన్ చేయండి. తర్వాత ఆధార్ విభాగానికి వెళ్లి 'మై ఆధార్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డు నంబర్, క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేయండి.అనంతరం OTP ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోండి. మొబైల్ నంబర్‌కి వచ్చిన OTPని ఎంటర్‌ చేయండి. ఇప్పుడు డౌన్‌లోడ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. తర్వాత చెక్‌ బాక్స్‌లో కనిపించే డౌన్‌లోడ్‌ మాస్క్‌డ్‌ ఆధార్‌ ఆప్షన్‌పై టిక్‌ చేయండి. చెక్‌ బాక్స్‌ను టిక్‌ చేసి సబ్మిట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి. వెంటనే మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు డౌన్‌లోడ్‌ అవుతుంది. మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డ్‌కి పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ ఉంటుంది. పాస్‌వర్డ్‌ కోసం మీ పేరులోని నాలుగు అక్షరాలు, మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని ఎంటర్‌ చేయాలి.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AadhaarCard #VoterID #EC #CEC #LokSabhaElections2024 #IndiaPolitics #Politics